కన్నడ హీరో  రిషబ్ శెట్టి హీరోగా నటించిన చిత్రం కాంతారా. ఈ చిత్రం కన్నడలో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇతర భాషలలో సైతం ఈ సినిమాని విడుదల చేయగా అక్కడ కూడా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతోంది. ఊహించని విధంగా మౌత్ టాకుతో ఒక మ్యానియాను సృష్టించింది కాంతర చిత్రం. ఈ సినిమా రోజు రోజుకి వసూళ్ల పరంగా పలు రికార్డులను సృష్టిస్తూ ఇండస్ట్రీ వర్గాలకు షాక్  మీద షాక్ ఇస్తూనే ఉంది.


సినిమా ఇప్పటికే విడుదలై నాలుగు రోజులైనా దాదాపు రూ. 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబడుతుంది అని సమాచారం. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా రప్పించిన సినిమాగా కూడా పేరు సంపాదించింది. కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ ట్రెండ్ వర్గాలు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపుగా  రూ.11 కోట్ల రూపాయలు వసూలు రాబట్టినట్లు సమాచారం. ఇక ఇదంతా ఇలా ఉండగా 1847, 1970,1990  ఏళ్ల లో సాగే కథతో రూపొందించిన ఈ చిత్రం.. ఈ చిత్రం ఉంటుందని ఎండింగ్లో చూపించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ సినిమా రాబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.



ఈ నేపద్యంలో హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారట. ప్రస్తుతం ఈ సినిమా సీక్రెట్ గురించి ఇంకా ఏమి ఆలోచించలేదు. ప్రస్తుతం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే వీటి గురించి ఆలోచిస్తానని తెలిపారు ఇదంతా ఇలా ఉండగా తెలుగులో కాంతారా బ్లాక్ బస్టర్ నాలుగు రోజుల్లోనే ఊహించని విధంగా కలెక్షలను రాబట్టి అల్లు అరవింద్ కు కొన్ని కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా సీక్రెట్ ఉంటుందా లేదా అనే విషయాన్ని హీరో ఎప్పుడూ చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: