చిరంజీవి బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి పందెం కోడి లా ఒకదాని పై ఒకటి పోటీపడటం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పోటీలో కొన్ని సందర్భాలలో బాలకృష్ణ విజయం సాధిస్తే మరికొన్ని సందర్భాలలో చిరంజీవి విజయం సాధించిన సందర్భాలు గతంలో చాల ఉన్నాయి.



ఇప్పుడు మళ్ళీ అదే సీన్ వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిపీట్ అవ్వబోతోంది. అయితే ఈసారి ఈపోటీ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు తననోప్పిగా మారే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ వాస్తవానికి ఈ నవంబర్ లో రావలసి ఉంది.



అయితే ఆమధ్య బాలయ్య కు కరోనా రావడంతో పాటు కొన్ని వారాల పాటు షూటింగ్ ల బంద్ నిర్మాతలు కొనసాగించడంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలి అని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నప్పటికీ బాలయ్య మాత్రం తన చిత్రాన్ని సంక్రాంతి రేస్ లోనే దించమని నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.



ఇక మెగా స్టార్ చిరంజీవి బాబి ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీ స్టారర్ ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కూడ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీని కూడ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాను కూడ సంక్రాంతి రేస్ లోనే ఉంచమని చిరంజీవి నిర్మాతల పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో మైత్రీ సంస్థ తమ రెండు భారీ సినిమాలను ఒకేసారి విడుదల చేసే సాహసం చేయగలరా లేదంటే ఏసినిమా కోసం మరొక సినిమాని వెనక్కి నెట్టుతారు అలా జరిగితే చిరంజీవి బాలకృష్ణ ఇగో లు ఏమి అవుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: