కార్తి, పి.ఎస్ మిత్రన్ కాంబో లో వస్తున్న సర్ధార్ క్రేజీ ఇండియన్ స్పై థ్రిల్లర్ గా వస్తుంది. ఈమధ్యనే పొన్నియిన్ సెల్వన్ సినిమా తో కార్తి తన పాత్రతో మెప్పించగా ఇప్పుడు సర్ధార్ గా వస్తున్నాడు. ఈ సినిమాలో కార్తి రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. ప్రిన్స్ వర్సెస్ సర్ధార్ రెండు సినిమాల మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫైట్ ఏర్పడుతుంది. ఇద్దరు తమిళ హీరోలు పొరుగు భాషలో పోటీ పడటం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రిన్స్ సినిమా ఫుల్ ఎంటర్టైన్ మూవీ గా వస్తుంది.
ఇక వీటితో పోటీగా వస్తున్న మంచు విష్ణు జిన్నా కూడా ఎంటర్టైన్ మెంట్ ప్రధానంగా వస్తుండగా విశ్వక్ సేన్ ఓరి దేవుడా మాత్రం ఓ మంచి కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకుల కోసం మంచి బజ్ తో వస్తున్నాయి. నాలుగు సినిమాలు టీజర్, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండగా సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. శివ కార్తికేయన్, కార్తి ఇద్దరు తమిళంలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు తెలుగులో వీరి మధ్య పోటీ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. మరి రిలీజ్ అవుతున్న ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుందో చూడాలి.