పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఇందులో కలిసి నటించారు.ఇక ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీగా మారుతోంది.చాలా అద్భుతమైన రెస్పాన్స్ ని ఈ సినిమా దక్కించుకుంది.ఇండియాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు రావడంతో నిర్మాత డీవీవీ దానయ్యకు కాసులవర్షం కురిసింది. దీంతో ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది.జపాన్లో "ఆర్ ఆర్ ఆర్ " మూవీని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జపాన్ రాజధాని అయిన టోక్యో నగరంలో 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో విడుదల చేయనున్నారు.ఇందులో భాగంగా చిత్రబృందం ఇప్పటికే జపాన్ చేరుకొని అక్కడ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాంచరణ్ రాజమౌళి దంపతులు జపాన్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.రాంచరణ్ ఎన్టీఆర్ కలిసి ప్రమోషన్స్ చేస్తుండగా మరికొన్ని చోట్ల వారు విడివిడిగా వెళుతున్నారు.


 ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ పనులను రాజమౌళి తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతున్నారు. జపాన్లో రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం యంగ్ టైగర్ కు ఉంది. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచిన పలు సినిమాలు జపాన్ భాషలో విడుదలై అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.ఎన్టీఆర్ డ్యాన్సులకు ఫిదా అయిన జపనీయులు రీల్స్  చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండటంతో అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ జపాన్లో చాలా యాక్టివ్ గా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి వారి నుంచి ఎన్టీఆర్ కు ఘనస్వాగతం లభిస్తోంది.ఎన్టీఆర్ ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లగా అక్కడి సిబ్బంది నుంచి ఆయనకు అపూర్వ స్పందన లభించింది. ఎన్టీఆర్ తో సెల్ఫీ ఫొటోలు దిగేందుకు వారంతా ఉత్సాహం చూపించడం కన్పించింది. ఆయన ఆటోగ్రాఫ్ ను అడిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: