అయితే జాతి రత్నం సినిమా కూడా దాదాపు అలాగే కామెడీ ఆధారంగా తీసిన సినిమానే. పూర్తిస్థాయిలో కథ, కథనం మీద ఎలాంటి దృష్టి పెట్టకుండా కామెడీతోనే బండి నడిపించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం దాదాపు సఫలం అయింది. తెలుగు ప్రేక్షకులందరికీ ఆ సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు దాదాపు అదే పద్ధతి ఫాలో అవుతూ ఈ ప్రిన్స్ సినిమాని కూడా తెరకెక్కించారు.
ఎలాంటి బాధ్యత, కామన్ సెన్స్ లేకుండా స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న స్కూల్ కి వెళ్లకుండా సినిమాలు చూస్తూ గాలికి తిరిగే ఒక వ్యక్తి ఒక ఫారెన్ అమ్మాయి ప్రేమలో పడితే ఆమెను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు? స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయితే స్వాతంత్రం తెచ్చుకోవాల్సి వచ్చిందో అదే దేశానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఆమెను ఎలా దక్కించుకున్నాడు అనే విషయం మీద ఈ సినిమాను రూపొందించారు. సాధారణంగా కంటెంట్ లేకుండా కామెడీ చేయడం అంటే చిన్న విషయం కాదు అలా చేయడానికి చాలా టాలెంట్ ఉండాలి.
ప్రిన్స్ లో కూడా జాతిరత్నాలు ఆ రేంజ్ నవ్వులు లేకపోయినా.. దాదాపు అదే చేశాడు. చెప్పుకోవడానికి సీరియస్ కథలా ఉంటుంది కానీ దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు అనుదీప్. లాజిక్ ల కోసం వెతుక్కోకుండా కామెడీ ఎంజాయ్ చేస్తే ఈ సినిమా నచ్చుతుంది కానీ జాతి రత్నాలు సినిమాకి వర్కౌట్ అయినట్లుగా ఈ సినిమాకి కామెడీ వర్కౌట్ అవలేదు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని సినిమాలు జాతిరత్నాలు అవ్వలేవు ఒక్కోసారి ఇలాంటి ఆణిముత్యాలు కూడా బయటకు వస్తాయనే మాట వినిపిస్తోంది. సినిమాలో అసలు ఏమాత్రం లాజిక్ లేదు, సినిమాని తెలుగు ఆడియోస్ కోసం తీసినట్లు కూడా ఏమాత్రం అనిపించదు తమిళ్ ఆడియన్స్ కోసం తీసి తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ చేసి వదిలిన ఫీలింగ్ కలుగుతుంది.