అందుకే జిన్నా మాస్ సెంటర్లలో అంతో ఇంతో ఆడొచ్చు. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. ఇంత వరకు ఇలాంటి దారుణమైన పరిస్థితి, బుకింగ్స్ ఏ సినిమాకు కూడా జరిగి ఉండదని తెలుస్తోంది.
నిన్న రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా జిన్నా అత్యంత అల్పంగా రన్ అయింది. మరీ దారుణంగా పదమూడు, పదిహేను టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. కాంతారా సినిమాకు మొత్తంగా శుక్రవారం రోజు 31K డాలర్లు వచ్చాయి. కన్నడ వర్షన్‌కు 13K డాలర్లు వచ్చాయట. ఇక ప్రిన్స్ సినిమాకు 17K, సర్దార్‌కు 9.5K, పొన్నియిన్ సెల్వన్‌కు 8K, ఓరి దేవుడా సినిమాకు 8K డాలర్లు వచ్చాయట. అయితే జిన్నా మూవీకి మాత్రం దారుణాతి దారుణంగా 150 డాలర్లు వచ్చాయట. అంటే పదమూడు లేదా పదిహేను టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
అయితే జిన్నా ఓవర్సీస్ మొదటి రోజు లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. మొత్తంగా పదిహేడు లొకేషన్ల నుంచి 493 డాలర్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. అంటే యాభై షోలు వేస్తే.. 49 టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఓవర్సీస్‌లో జిన్నా అతి పెద్ద డిజాస్టర్‌గా మిగులుతుంది. ఇలాంటి కలెక్షన్లు మరే సినిమాకు కూడా రావేమో అనేంత అట్టడుగు స్థాయిలో ఉండబోతోందనిపిస్తోంది. ఓవర్సీస్‌లో డిజాస్టర్లకే డిజాస్టర్‌గా జిన్నా నిలవబోతోందన్న మాట. మరి లోకల్ మార్కెట్లోనైనా జిన్నా హిట్‌గా నిలుస్తుందో లేదా చూడాలి. అసలే అతి తక్కువ టార్గెట్‌తో జిన్నా బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఐదు కోట్లు అంటూ మార్క్ పెట్టుకుని జిన్నా అతి తక్కువ థియేటర్లో విడుదలైనట్టు సమాచారాం.