ఈసినిమా చిత్రీకరణ ఇంచుమించు పూర్తి కావడంతో బాలయ్య వచ్చే నెల నుండి ప్రారంభం కాబోయే అనీల్ రావిపూడిమూవీ పై దృష్టి పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం కామెడీ సినిమాలను మాత్రమే తీసిన అనీల్ రావిపూడి ఈసారి బాలకృష్ణ ను చాల డిఫరెంట్ యాంగిల్ లో చూపెట్టబోతున్నాడు. ఈమూవీలో బాలయ్య 50 సంవత్సరాల మధ్య వయసు పాత్రలో నటిస్తూ ఉంటే అతడి కూతురుగా శ్రీలీల నటిస్తోంది.
ఈమూవీలో బాలయ్య పక్కన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అంజలి ప్రియమణి లు బాలయ్య పక్కన రొమాన్స్ చేయబోతున్నారు. పల్లెటూరు నేపధ్యం నుండి వచ్చిన బాలకృష్ణ తన కూతురు ఉన్నత చదువుల కోసం సిటీ వచ్చి ఈనాటి యూత్ అలవాట్లను తనకు ఇష్టం లేకపోయినా నేర్చుకుని యూత్ కు సవాల్ విసిరే ఒక డిఫరెంట్ పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. ఈమూవీకి చాల డిఫరెంట్ టైటిల్ కూడ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి 'బ్రో ఐ డోంట్ కేర్' అన్న టైటిల్ ఫిక్స్ చేసారు అని టాక్. వాస్తవానికి అనీల్ రావిపూడి సినిమాలలో కామెడీ చాల ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి అతడు తన జోనర్ మార్చుకుని ఒక వెరైటీ సబ్జెక్ట్ తో తాను కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాదు ఆలోచించి సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలను కూడ చేయగలను అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనితో బాలయ్యఅనీల్ రావిపూడి కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి..
.