ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు ఏదొక సమస్య తో ఆసుపత్రిలో చేరుతున్నారు.. సినీ ఇండస్ట్రీలో చాలా మంది చిన్న సమస్య కదా అని ఆసుపత్రికి వెళ్ళి చివరికి ప్రాణాలను కొల్పొతున్నారు..ఇప్పుడు స్టార్ ఆసుపత్రిలో ఆయన ఫ్యాన్స్ కూడా ఆందోళ లో ఉన్నారు.అతను ఎవరో కాదు బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్..వరుస షో లతో అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు.కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో గాయం అయింది. ఈ మేరకు అమితాబ్ తన బ్లాగ్లో వివరాలు వెల్లడించారు. షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్ అయిందని చెప్పారు.


దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రక్త స్రావాన్ని ఆపడానికి కొన్ని కుట్లు కూడా వేశారని తెలిపారు. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాని.. అభిమానులు ఆందోళని చెందవద్దని కోరారు బిగ్ బీ.అక్కడ ఇనుప ముక్క తగిలి నరం కట్ అయింది. రక్త స్రావం కూడా జరిగింది. రక్తా స్రావాన్ని ఆపడానికి కుట్లు వేశారు. షో స్టాఫ్ టీమ్, డాక్టరు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వాకింగ్ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారు అని అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ఫ్యాన్స్ ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరి కొంత మంది ఆయన షూ వేసుకున్నా కూడా ఎలా గాయం అయ్యింది..షో యాజమాన్యం సరిగ్గా లేనందున ఇలా జరిగిందని మండిపడుతున్నారు..ఏది ఏమైనా ఈ వార్త బాలివుడ్ ఇండస్ట్రీని టెన్షన్ పెడుతుంది..


చివరిసారిగా బిగ్బీ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న ‘ఉంచాయి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: