వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని అందుకే వీరు విడిపోయారని వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే విడాకుల ఘట్టం ముగిసిన తర్వాత ఇటీవల కొత్త వార్తలు అయితే పుట్టుకొస్తున్నాయి.. వీరు మళ్ళీ కలుస్తున్నారు అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వీరి విడాకుల ప్రకటనపై రజనీకాంత్ కలత చెందారని విడిపోవడం మంచిది కాదు అని నచ్చజెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేసారని ఈ నేపథ్యంలో ఇద్దరు ఒప్పుకుని విడాకులు రద్దు చేసుకోవాలని అనుకున్నారు అంటూ జోరుగా అయితే ప్రచారం జరిగింది.
కానీ ఈ వార్తలు నిజమో కాదో తెలియక ఫ్యాన్స్ కూడా తికమక పడ్డారు.. ధనుష్, ఐశ్వర్య ప్రైవేట్ పార్టీలకు కూడా హాజరవ్వడంతో ఇది నిజమే అని చాలా మంది భావించారు.. ఈ వార్తలకు నిజం చేకూరేలా ధనుష్ ఫాదర్ కూడా రజినీకాంత్ విడాకుల విషయంలో మాట్లాడుతున్నారు అని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారట.
కానీ ఇప్పుడు మళ్లీ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారని తెలుస్తుంది... ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలవడం పై రజనీ ఇంట జరిగిన దీపావళి ఫెస్టివల్ వేదికగా క్లారిటీ ఇచ్చేసారు.. దీపావళి సెలెబ్రేషన్స్ ను ఐశ్వర్య రజనీకాంత్ కుటుంబ సభ్యులతో జరుపు కుంది.. ఈ ఫెస్టివల్ మోడ్ లో ధనుష్ కూడా కనిపిస్తే వీరు కలవడం కన్ఫర్మ్ అని అనుకునే వారు కానీ తాజాగా వైరల్ అవుతున్న ఫొటోల్లో ధనుష్ ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో ఫెస్టివల్ వేదికగా క్లారిటీ ఇచేసినట్టు అనిపిస్తుంది. దీంతో ధనుష్ కు ఐశ్వర్యతో కలిసే ఉద్దేశం లేదని అంతా అయితే భావిస్తున్నారు.