దర్శకుడు మెహర్ రమేష్ ఎలాంటి సినిమాలను చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దర్శకుడిగా ఆయన మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ రచయితగా ప్రేక్షకులలో మంచి ముద్ర వేసుకోలేకపోయారు. అందుకే ఆయన సినిమాలలో ఎక్కువగా భారీ డిజాస్టర్లే ఉంటాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా కంత్రి అందరినీ నిరాశ పరిచింది. రెండో సినిమా బిల్లా అయితే సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి కొంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్  రూపొందించడంలో మెహర్ రమేష్ మాత్రం 100కు 100% సక్సెస్ అయ్యాడు.  ఆ విధంగా ఆయన బిల్లా సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరిచాయి. శక్తి షాడో వంటి భారీ డిజాస్టర్ లతో మరొకసారి ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేయకుండా అయిపోయింది. అలా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ దర్శకుడితో సినిమా చేయాలని నిర్ణయించారు. అప్పుడే మెగా అభిమానులు అందరూ కూడా ఈ సినిమా చేయడం అవసరమా అని చిరంజీవికి సలహాలు ఇచ్చారు.

కానీ రీమేక్ సినిమా అవడంతో మెహర్ రమేష్ ఈ సినిమాను చేయగలిగాడు అని సర్ది చెప్పుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమా అవుట్ ఫుట్ బయటకు వచ్చింది. దీపావళి సందర్భంగా నే ఈ సినిమాను విడుదల చేస్తారని ప్రతి ఒక్కరు కూడా భావించారు కానీ ప్లాన్స్ మారిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు విడుదల చేయడంతో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడంతో ఈ సినిమాను వేసవికి విడుదల చేయబోతున్నారు. దీనిపట్ల మెహర్ రమేష్ కొంత అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు ఆయన సన్నిహితుల దగ్గర నుంచి వినపడుతున్నాయి. దాదాపు ముగిసిపోయిందనుకున్న కెరియర్ ఈ సినిమాతో మళ్ళీ మొదలవుతుంది ఈ నేపధ్యంలో ఆ తర్వాత మరొక పెద్ద హీరోతో సినిమా చేయాలని మెహర్ భావిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా సినిమా ఆలస్యం అవ్వడం ఆయన కెరియర్ పై కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: