నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఆయన గతంలో చేసిన ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలకు దాదాపుగా ఇలాంటి టైటిల్స్ నే నిర్ణయించడం జరిగింది. అవి ఎంతటి పెద్ద విజయాలను అందుకున్నాయో ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత చాలా రోజులకు ఒక మాస్ మసాలా ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ చిత్రం కోసం పాత సెంటిమెంట్ ను వాడడం ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుంది అని చెబుతున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇటీవల ఈ సినిమా యొక్క టైటిల్ ను ఓకే చేయగా అప్పుడు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. శృతి హాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తూ ఉండడం ఈ సినిమా పట్ల పారి స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయని చెప్పాలి.

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలను ఎంతగానో చేసి ప్రేక్షకులను అలరించే దర్శకుడైన గోపీచంద్ తో కలిసి ఈ సినిమా చేయడం తప్పకుండా సినిమాపై మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ కొన్ని రియల్ స్టంట్స్ చేయడం విశేషం. 50 పదుల వయసు దాటినా కూడా ఆయన రియల్ స్టంట్స్ చేయడం నిజంగా ఇతర హీరోలకు ఆదర్శప్రాయం అనే చెప్పాలి. ఈ వయసులో ఆయన సినిమా కోసం ఇంతటి ఎఫర్ట్స్ పెట్టడం ఆయనకు మంచి పేరును తీసుకువస్తుందని చెప్పాలి. మొదటి నుంచి తన సినిమా పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించి బాలకృష్ణసినిమా భారీ విజయం అందుకునేలా చేస్తూ వచ్చారు. అలాంటి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఆయనకు తెచ్చి పెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: