ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ప్రేమ ఒక ఇంటర్య్వూలో మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాల ను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి ప్రేమ పాపులారిటీని పెంచుకున్నారు. ఒకవైపు స్టార్ హీరోల కు మరోవైపు అంతగా క్రేజ్ లేని హీరోలకు జోడీగా నటించి ప్రేమ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు.

బెంగళూరులో జన్మించిన ప్రేమ తన సినీ కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించి మెప్పించారు. 2009 తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రేమ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రేమ ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో నేను నటించానని ప్రేమ తెలిపారు.

మోహన్ బాబుతో షూట్ అంటే టెన్షన్ గా ఉంటుందని షాట్ సరిగ్గా రాకపోతే ఆయన తిడతారని చాలామంది నటీనటులు కూడా చెబుతుంటారు. మోహన్ బాబుతో షూట్ అంటే చాలా భయపడ్డానని ఆమె కామెంట్లు చేశారు. మోహన్ బాబు గురించి గతంలో నేను విన్న విషయాల వల్ల నాకు భయం కలిగిందని ఆమె అన్నారు.
మోహన్ బాబు గారితో నటించడం సులువు కాదని అయితే రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఏకంగా నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించానని ప్రేమ పేర్కొన్నారు. మోహన్ బాబుకు పోటీగా నేను నటించానని ఆయనను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాలంటే భయం వేసేదని ప్రేమ చెప్పుకొచ్చారట.. ప్రేమ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రేమకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: