టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిల నుంచి ఎప్పటికప్పుడు వారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు.
అంతేకాదు అవకాశాల కోసం కమిట్మెంట్ పేరుతో దర్శకనిర్మాతలు, హీరోలు కూడా వారిని వేధిస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కొంతమంది తమ బాధలను బయటపెడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని అందరితో తెలియజేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ ని మాత్రం ప్రేమ పేరుతో మోసగించి స్నేహితుల చేత ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేయించి మరీ చంపేసి.. ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని ఆమె తల్లి మీడియాతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయింది..

ఆమె ఎవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన ప్రత్యూష.. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాలలో నటించి ఆ తర్వాత తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అర్ధాంతరంగా మరణించింది. అనుమానాధాస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి తనకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసు పెట్టినా సరే వెనక్కి తగ్గాలని.. భయపెడుతూ ఫోన్స్ చేసేవారు అంటూ సరోజినీ దేవి చెప్పుకొచ్చారు . అయితే తాను పోరాటం చేయడం ఎక్కడ ఆపలేదని, తన కూతురు చనిపోయి 20 సంవత్సరాల అవుతున్నా.. సరైన న్యాయం మాత్రం జరగలేదు అని ఆమె ఎమోషనల్ అయ్యింది..

వాస్తవానికి ప్రత్యూష మరణించినప్పుడు ప్రత్యూష తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి తో కలిసి.. వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లే విషం తాగి మరణించాలని భావించారు. అయితే ఇద్దరూ కూడా విషం తాగినప్పుడు ప్రత్యూష మరణించింది.. సిద్ధార్థ రెడ్డి బ్రతికాడు అన్న వార్త బాగా ప్రచారం అయింది . అంతేకాదు ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందని అప్పట్లో వార్తలు ప్రకంపనలు సృష్టించినా ఎవరు ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. కానీ సరోజినీ దేవి మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఎంక్వయిరీ తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల సమయంలో దాదాపు 5 గెస్ట్ హౌస్లు మారుస్తూ సిద్ధార్థ రెడ్డి అతని గ్యాంగ్ తో ప్రత్యూషను దారుణంగా అత్యాచారం చేశారు అని ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించింది. చివరి గెస్ట్ హౌస్ కి వెళ్లేసరికి ప్రత్యూష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది . అందరూ కలిసి సిద్ధార్థ ను ముందుకు పెట్టి తప్పించుకున్నారు అని, సిద్ధార్థ రెడ్డి నోరు విప్పితే అందరూ బయటికి వస్తారని కూడా ఆమె తెలియజేసింది.ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో అమెరికాలో సెటిల్ అయ్యారు.. అతను ఎలాగో నోరు విప్పడు కాబట్టి దేవుడే వారిని శిక్షిస్తాడు అంటూ ఆమె ఎమోషనల్ కామెంట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: