కొన్నాళ్లుగా ఆమెపై నెగిటివిటీ పెరిగిపోగా… ఐ డోంట్ కేర్ అన్నట్లు సంకేతాలు పంపుతుంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన వీడియో హేటర్స్ ని బాగా రెచ్చగొట్టేలా ఉంది. షార్ట్, టాప్ ధరించి హాట్ గా తయారైన అనసూయ… ముసుగు వెనక ఉండే ట్రోలర్స్ నాస్టీగా మారినప్పుడు, నా ఆటిట్యూడ్ ఇలా చూపిస్తాను, ఎందుకంటే హేటర్స్ కి మించిన సంఖ్యలో కుటుంబ సభ్యుల్లా ప్రేమించే అభిమానులు ఉన్నారు, అని వీడియోకి కామెంట్ పోస్ట్ చేశార
నన్ను అభిమానించే వారు అనేక మంది ఉండగా కొద్ది మంది హేటర్స్, ట్రోలర్స్ ని నేను లెక్క చేయను అన్న సందేశం అనసూయ పంపారు ఇలా. అదే సమయంలో మీరు ఎంత ట్రోల్ చేసినా నేను తగ్గేది లేదని డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ తరహా యాటిట్యూడ్ అనసూయ మొదటి నుండి మైంటైన్ చేస్తున్నారు అంటా మరీ. ఫేమ్ వచ్చినప్పటి నుండి అనసూయ డ్రెస్సింగ్ స్టైల్, ప్రవర్తన విమర్శలకు గురవుతుంది. సదరు విమర్శలను అనసూయ తనదైన శైలిలో ఇలా తిప్పికొడుతున్నారు.
ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్నారు. లైగర్ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ అభిమానులను రెచ్చగొట్టే ట్వీట్ కూడా వేశారు. అసలే డిజాస్టర్ టాక్ తో క్రాక్ లో ఉన్న ఫ్యాన్స్ అనసూయ ట్వీట్ పై తేగా మండిపడ్డారు. ఆంటీ అంటూ అనసూయను ట్రోల్ చేశారు. ఈ వివాదం మూడు నాలుగు రోజులు నిరవధికంగా నడిచింది. అనసూయ కూడా తగ్గకుండా ట్రోలర్స్ కి రిప్లైలు ఇచ్చారు. ఆంటీ అంటూ వేధించారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
కొందరిపై చర్యలు కూడా తీసుకున్నట్లు మనకు సమాచారం. ఈ వివాదం తర్వాత అనసూయను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ఎక్కువైంది. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా క్రింద నెగిటివ్ కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. దారినపోయే ప్రతివాడి కామెంట్ ని పట్టించుకోవడం, అనసూయ స్పందించడం కూడా దీనికి కారణం. ట్రోల్స్ కి అనసూయ స్పందించినంత కాలం ఇది ఆగడు. అందులోనూ ఆమె చర్యలు కొంచెం రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ప్రతి సెలెబ్రిటీకి కామన్. వాటికి స్పందిచే కొలది ఎక్కువ అవుతాయి అని వివరిచారు.