
ఇలాంటి పరిస్థితులలో చిరంజీవితో బాబికి ఒక సినిమా చేయడం ఒక అదృష్టంగా మారింది. ‘వాల్టేర్ వీరయ్య’ టైటిల్ తో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈమూవీలో రవితేజా కూడ ఒక కీలక పాత్రలో చేస్తూ ఉండటంతో ఈమూవీ భారీ మల్టీ స్టారర్ గా మారింది. ఈమూవీలో రవితేజా చిరంజీవికి సవితి తమ్ముడుగా నటిస్తున్నాడు.
చాల సంవత్సరాల క్రితం మణిరత్నం తీసిన ‘ఘర్షణ’ మూవీ ఛాయలు ‘వాల్టేర్ వీరయ్య’ లో కనిపిస్తాయి అని అంటున్నారు. సవితి సోదరుల ఇగో చుట్టూ తిరిగే కథతో ఈమూవీ ఉంటుంది. ఈమూవీ సంక్రాంతి రేస్ కు రాబోతోంది. అయితే ఈమూవీ బ్లాక్ బష్టర్ అవ్వడం చిరంజీవి రవితేజ ల కంటే దర్శకుడు బాబికి అత్యంత కీలకంగా మారింది. దీనితో బాబి ఈసినిమా విజయం కోసం తన పేరులో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు బాబి దర్శకత్వం వహించిన సినిమాల టైటిల్స్ లో దర్శకుడుగా అతడి పేరును టైటిల్ కార్డులో వేసినప్పుడు ‘బాబి’ అని వేసేవారు. అయితే ఈసారి ‘వాల్టేర్ వీరయ్య’ మూవీ టైటిల్స్ లో మాత్రం దర్శకుడుగా బాబి పేరును ‘బాబి కొల్లి’ అని వేస్తారట. ఇలా పేరులో మార్పు చేసుకుంటే అతడికి అదృష్టం కలిసి వస్తుందని ఎవరో జ్యోతిష్కుడు ఆయనకు చెప్పాడట. మరి ఈ పేరులో మార్పు బాబికి ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి. అయితే ‘వాల్టేర్ వీరయ్య’ కు పోటీగా ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ మూవీ కూడ వస్తూ ఉండటంతో ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది..