జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తిగా దేశంలోని అందరికీ సుపరిచితమైనప్పటికీ ఆమెను నటిగా నిరూపించే ఒక మంచి సినిమా ఇప్పటివరకు ఆమె కెరియర్ కు సంబంధించి రావడంలేదు. ఇది ఇలా ఉండగా ఆమె తాను నటించే కథల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల ఆమె కెరియర్ ముందుకు సాగడం లేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.


అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా జాన్వీ దేశవ్యాప్తంగా యూత్ లో తన క్రేజ్ ను పెంచుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ మీడియాకు ఎప్పుడు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా ఒక వెబ్ పోర్టల్ కు ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పెళ్ళి పై చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  


భవిష్యత్ లో ఆమె తన పెళ్ళికి సంబంధించి స్వయంవరం ప్రకటించవలసి వస్తే బాలీవుడ్ హీరోలలో ఎవర్ని పిలుస్తావు అన్న ప్రశ్నకు ఆమె ఆశక్తికర సమాధానం ఇచ్చింది. తన స్వయంవరానికి హృతిక్ రోషన్ రణబీర్ టైగర్ లను పిలుస్తాను అని చెప్పింది. అయితే రణబీర్ కు ఇప్పటికే పెళ్ళి అయిపోయింది కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఒక షాకింగ్ కామెంట్స్ చేసింది.


వాస్తవానికి తన స్వయం వరానికి విజయ్ దేవరకొండను ఆహ్వానించాఅని తాను భావించానని అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండకు మానసికంగా పెళ్ళి అయిపోవడంతో తాను తన స్వయంవరానికి విజయ్ ఆహ్వానించే ఆలోచన లేదు అంటూ కామెంట్ చేసింది. దీనితో విజయ్ దేవరకొండను మానసికంగా పెళ్ళి చేసుకున్నది ఎవర్ని అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ మొదలైంది. ఈమధ్య విజయ్ రష్మిక తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్ళడంతో ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాన్వీ ఇలాంటి కామెంట్స్ చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో జాన్వీ తనకు విజయ్ దేవరకొండ పై క్రష్ ఉంది అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే..  




మరింత సమాచారం తెలుసుకోండి: