తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే  సమంత తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ మూవీ లలో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ,  తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లోని స్పెషల్ సాంగ్ తో సమంత పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన తెలుగు ,  తమిళ ,  కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే యశోద మూవీ నుండి తాజాగా ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. యశోద మూవీ ఓవర్సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతున్న యశోద మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: