తెలుగు సినీ ఇండస్ట్రీలో బొమ్మరిల్లు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు హీరో సిద్ధార్థ్. అయితే గత కొంతకాలంగా సిద్ధార్థ నటించిన ఏ సినిమాలు కూడా టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేక కాలేకపోతున్నాయి.గత సంవత్సరం rx 100 సినిమా ఫేమ్ తో మంచి పాపులారిటీ సంపాదించిన అజయ్ భూపతి సిద్ధార్థ, శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమాని తెరకెక్కించారు.ఇందులో హీరోయిన్స్ గా అతిథి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ నటించారు. శర్వానంద్ కు జోడిగా అను ఇమ్మానుయేల్ నటించగా.. సిద్ధార్థ కు జోడిగా అదితి రావు హైదరి నటించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ,అదితి రావు హేదరి ప్రేమలో పడ్డారని వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా ఇలా ఉండగా గడిచిన రెండు రోజుల క్రితం..అదితి రావు హైదరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. హృదయ యువరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నీ ప్రతి కల నెరవేరాలని కోరుకుంటున్నానని అదితి రావు హైదరి తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది  సిద్ధార్థ.

ఇక దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ వార్తలు నిజమనే విధంగా సిద్ధార్థ,అదితి రావు హైదరి ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళుతూ ఉండడం ప్రతి ఒక్కరికి అనుమానాలకు దావితీస్తోంది. ప్రత్యేక వెకేషన్ కి వెళ్తున్న సిద్ధార్థ,అదితి రావు హైదరి కెమెరా కంటికి కనిపించడం జరిగింది. సిద్ధార్థ బ్లూ కలర్ షర్టు ముఖానికి మాస్క్ తో క్యాజువల్ గా కనిపిస్తూ ట్రావెలింగ్ బ్యాగ్ తో కనిపించారు.అదితి రావు హైదరి బ్లాక్ కోడ్ బ్లూ జీస్ ధరించి తన కూడా ట్రావెల్ బ్యాక్ తో కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: