చాన్నాళ్లకు మంచు ఫ్యామిలీ నుండి మంచి హైప్‌తో రిలీజ్ అయిన మూవీ జిన్నా. దానికి ప్రధాన కారణం సన్నీ లియోన్ 'జిన్నా'లో ప్రధాన పాత్ర చేయటమే.ట్రైలర్స్‌కు డీసెంట్ టాక్ రావటం, ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్‌కు క్రేజ్ దక్కటం, అన్నింటికీ మించి ప్రమోషన్స్‌లో మంచు ఫ్యామిలి ఓవర్ యాక్షన్ లేదంటూ పాజిటీవ్ కామెంట్స్ రావటం, సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ తగ్గటం వంటి పరిణామాలతో జిన్నా విడుదలై యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకుంది.

కామెడీ, చమ్మక్ చంద్ర వెన్నెల కిషోర్ ట్రాక్, సన్నీ లియోన్ నటన, అందాలు ఇవన్నీ కూడా జిన్నాకి ప్లస్ అవ్వనున్నాయని భావించారు అంతా. అయితే టాక్ బాగున్నా సినిమా చూడడానికి ప్రేక్షకులు మాత్రం రాలేదు. దాంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఘోరంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి దాదాపు 70 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు సమాచారాం. ఈ లెక్కన కనీసం సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ చేయలేకపోయిందని అంటున్నారు. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ దాదాపు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.ఈ చిత్రం తెలుగులో నాలుగు కోట్లు బిజినెస్ చేయగా ఐదు కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. కానీ ఇంత వరకు కోటి కూడా వసూల్ చేయలేకపోయింది.దీంతో బాక్సాఫీస్ వద్ద జిన్నా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అయితే మొదటిరోజు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాకపోవడానికి మంచు కుటుంబంపై ఉన్న నెగిటివ్ టాక్ అని అంటున్నారు క్రిటిక్స్. జిన్నా ప్రమోషన్స్ మొదట్లో అంతా బాగానే ఉన్నా.. విడుదలై హిట్ టాక్ వచ్చాకా.. మంచు విష్ణు మీడియాలో మళ్లీ రెచ్చిపోయాడు. హిట్ వచ్చేసిందన్న ధీమాతో మెగా ఫ్యామిలీని పదేపదే కించపరిచాడు. ఇంకేముంది మళ్లీ ట్రోలర్స్ విశ్వరూపం చూపించారు. జిన్నా పబ్లిక్ టాక్ పై కామెడీ, విష్ణు మీడియా కామెంట్స్‌పై మీమ్స్ చేస్తూ అందరికి జిన్నా సినిమాని సోషల్ మీడియాలోనే చూపెట్టేయటంతో థియేటర్ కి ఆడియన్ దూరమయ్యారని టాక్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: