బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతూ వస్తున్నాయి.అయితే అందులో కొన్ని మాత్రమే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..అందులో ఒకటి క్యాష్..ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.మల్లెమాల వారు నిర్మిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి వారం కూడా సెలబ్రిటీ గెస్ట్ లు వస్తూ ఉంటారు. పెద్దగా ఖర్చు లేకుండా రూపొందుతున్న క్యాష్ కార్యక్రమానికి అత్యధిక లాభాలను మల్లెమాల వారు దక్కించుకుంటూ ఉంటారంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.


ఇక క్యాష్ కార్యక్రమంలో స్టూడెంట్స్ అంటూ కొందరు వస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏ కాలేజీ వారు ఎక్కడి వారు అనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించగా అసలు వాళ్లు స్టూడెంట్స్ కాదని వెళ్లడైంది.వాళ్లంతా కూడా జూనియర్ ఆర్టిస్టులుగా సమాచారం అందుతుంది. జూనియర్ ఆర్టిస్టులను తీసుకు వెళ్లి స్టూడెంట్స్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలా మంది రిపీట్ అయిన వాళ్లే ఉంటారు. కొన్ని సార్లు మాత్రం ఏదైనా కాలేజీకి సంబంధించిన వారు ప్రత్యేకంగా వచ్చి షోలో సందడి చేస్తారు. అంతే తప్పితే ఎక్కువ శాతం షోలో కనిపించే వారు స్టూడెంట్స్ కాదని జూనియర్ ఆర్టిస్టులని తాజాగా అధికారికంగా నిరూపితం అయ్యింది.


షో లో కనిపించే కొందరు వేరే షో లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులుగా కూర్చుంటున్నారు. అందుకే సుమ క్యాష్ కార్యక్రమం అంతా మోసం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా పై నుండి వస్తువులు పడుతూ పగిలి పోయే సన్నివేశాలను కూడా చూపిస్తూ ఉంటారు. అది కూడా మోసమే అని.. నిజంగా వస్తువులను పడి వేయరు. 50 రూపాయలు.. వంద రూపాయలు ఖర్చు చేసి ధర్మకోల్ తో రూపొందించిన వస్తువులను కింద పడేసి బిల్డప్ ఇస్తూ ఉంటారని చాలా మందికి ఇటీవలే అర్థమైంది. ఇక సుమ కార్యక్రమంలో ఇచ్చే లక్షల రూపాయల డబ్బు లో ఒక్క రూపాయి కూడా ఇవ్వరని మరోసారి నిరూపితమైంది. మొత్తానికి మల్లెమాల ఈటీవీ వారు క్యాష్ కార్యక్రమం పేరుతో ప్రేక్షకులను చాలా మోసం చేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ వార్త నెట్టింట చర్చలకు దారి తీసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: