పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించు కుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం విడుదల అయింది. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారట.. తెలుగు రాష్ట్రాలలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తోపాటు కలెక్షన్ సునామీని కూడా సృష్టించింది.
ముఖ్యంగా ఈ సినిమా కన్నడ సాంప్రదాయమైన భూతకోల ఆచారం నేపథ్యంలో ఎంత ఆసక్తికరంగా కాంతారా సినిమా ను తెరకెక్కించారట.. ఈ సినిమా క్రేజ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దీంతో ఓటీటిలో త్వరలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కి కల్చర్ కి కనెక్ట్ అయిపోయారు ఆడియోస్ అని చెప్పవచ్చు. మంచి కలెక్షన్లను రాబట్టి ప్రశంసల వర్షం అయితే అందుకుంటోంది.
ఇక ఈ చిత్రం లో ముందుగా హీరో రిషబ్ శెట్టి కాదట.. ఈ సినిమాకి రిషబ్ దర్శకత్వంతో పాటు హీరోగా వ్యవహరించారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా దివంగత నటుడు పునీత్ రాజకుమార్ అనుకున్నారట. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాల ని ముందుగా అనుకున్నారట. అందుకోసం హోంభలే ప్రొడక్షన్ హౌస్ ని కూడా సంప్రదించారట. అన్ని కుదిరిన తర్వాత పునీత్ రాజకుమార్ సినిమా చేయాలనుకున్న సమయంలో పునీత్ రాజుకు వెళ్లి కలవగా.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే నువ్వే హీరోగా నటించాలని సలహా ఇచ్చారట. దీంతో రిషబ్ శెట్టి సినిమాలో హీరోగా నటించారని తెలిపారట.