బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చింది.
'బనారస్' ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రమోషన్స్ చేశారు. వైజాగ్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలసే అవకాశం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు సమయానికి జైద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేశాడట జైద్.
'పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ని కలిసే అవకాశం వచ్చింది. మా తెలుగు ట్రైలర్ ఆయన చేతుల మీదగా విడుదల చేయాలనీ అనుకున్నాం. కానీ సమయానికి నాకే కుదరలేదు. ఈ విషయంలో ఆయనకి క్షమాపణలు చెప్తాను. మరోసారి ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తాను. బనారస్ పాన్ ఇండియా కంటెంట్ వున్న సినిమా. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది'' అని చెప్పుకొచ్చారట జైద్.
అలాగే బనారస్ కంటెంట్ లో ఒక మిస్ట్రీరియస్, డార్క్ ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే అన్నారట..