ఆరు పదుల వయసులోనూ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలను ఒప్పుకుంటూ పోవడం ఆయన అభి మానులను ఎంతగానో సంతోష పెడుతుంది. ఇప్పటికే ఆయన ఫోర్త్ గేర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ లో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇ టీవలే పెద్దన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు జైలర్ అనే సినిమాతో త్వరలోనే అందరిని మళ్లీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా నె ల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సిని మాపై అందరిలో భారీ అంచనాలే నెలకొనగా ప్రస్తుతం ఆయన మరొక రెండు సినిమాలు ఇదే నిర్మాణ సంస్థతో చేయడానికి అంగీకరించడం విశేషం మామూలుగా అయితే రజనీకాంత్ సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే గగనం. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వరుస సినిమాలను ఒప్పుకోవడం అందరినీ ఆనంద పరుస్తుంది. మరి దర్శకులు ఇంకా ఎవరో కన్ఫమ్ కాలేదు.

అలా ఈ రెండు సినిమాలను ఆయన ఓకే చేయడం చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. మరి సినిమాలను ఒప్పుకోవడంలో చూపిస్తున్న జాగ్రత్త వాటిని హిట్ చేయడంలో కూడా చూపిస్తే రజనీకాంత్ కు తిరుగే ఉండదు అని చెప్పాలి. యువ హీరోల మాదిరిగా ఈ హీరో కూడా ఈ వయసులో వరుస సినిమాలను చేయడం నిజంగా మంచి విషయమే. తమిళం తో పాటు తెలుగు హిందీ మలయాళ కన్నడ భాషలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ ఈ జైలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడో చూడాలి. ఈ సినిమా లో పలువురు పాన్ ఇండియా నటులు నటిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: