మహేష్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కావడంతో ఈ మూవీ షూటింగ్ పరుగులు తీస్తుంది అని భావించారు. వచ్చే ఏడాది సమ్మర్ రేస్ టార్గెట్ గా విడుదల కావలసి ఉన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కేవలం కొన్నిరోజులు జరిగి వెంటనే బ్రేక్ పడిపోయింది. మహేష్ తల్లి మరణించడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని అంతా భావించారు.
అయితే ఈమధ్యలో మహేష్ అమెరికా కొన్ని వ్యక్తిగత పనుల రీత్యా వెళ్ళడంతో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ పడిందని మరికొందరు భావించారు. అయితే ఇప్పుడు ఈ బ్రేక్ కు సంబంధించి అసలు కారణం వేరు అంటూ సరికొత్త గాసిప్పులు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇంకా పూర్తిగా మహేష్ కు నచ్చిన విధంగా తయారు కాలేదు అని అంటున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ గా హడావిడి చేస్తున్న రూమర్స్ ప్రకారం ఈ మూవీ కథను పూర్తిగా త్రివిక్రమ్ వ్రాయకుండా ఒక టీమ్ ను పెట్టుకుని వారితో ఈమూవీ స్క్రిప్ట్ వ్రాయించడంతో ఈసమస్యలు వచ్చాయి అని అంటున్నారు. వాస్తవానికి ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే షూటింగ్ ఆగిపోవడానికి ఈమూవీకి సంబంధించిన పక్కా స్క్రిప్ట్ పూర్తిగా మహేష్ కు నచ్చే విధంగా తయారు కాకపోవడం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి చేయి తిరిగిన రచయితగా పేరుగాంచిన త్రివిక్రమ్ ఒక మూవీ కథను తయారు చేయడం పెద్ద కష్టం కాదని అయితే తన భార్యను నిర్మాతగా మార్చి కొన్ని సినిమాలకు నిర్మాణ భాగాస్వాయం వహిస్తూ ఆ సినిమాల స్క్రిప్ట్ వర్క్ ను కూడ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తూ ఉండటంతో మహేష్ తో తీస్తున్న సినిమా స్క్రిప్ట్ విషయంలో పూర్తి శ్రద్ద వహించలేక పోతున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన త్రివిక్రమ్ కు కథ వ్రాసే విషయంలో కష్టం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..