కన్నడ సినీ పరిశ్రమను మరింత హైప్ తెచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమా చూడని అభిమానులు ఓటిటి లో విడుదలవుతే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఇంకా ఇప్పటికి కలెక్షన్ల సునామి సృష్టిస్తూ ఉండడంతో ఓటిటి వేదిక మీద కాస్త ఆలస్యంగా స్త్రిమ్మింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు పైన కావస్తున్న అటు తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా కలెక్షన్లను భారీగానే రాబడుతోంది.


ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా కాంతారా సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడు వస్తుందా అంటూ ఒక వర్గ నిర్మాతలు, ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబర్ 4వ తేదీన ఓటీటి లో రాబోతోంది అని వార్తలు వినిపించినప్పటికీ అందులో నిజం లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక అధికారికంగా ఈ సినిమా పైన క్లారిటీ వచ్చేవరకు ఈ రూమర్స్ ని నమ్మకూడదని తెలియజేశారు చిత్ర బృందం.


అయితే ఈ సినిమా ఓటీటి హక్కులను మాత్రం  అమెజాన్ ప్రైమ్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుంచి కొన్ని ఆఫర్లు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.అనుకున్నా డీల్ కంటే ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అందుకు తగ్గట్టుగా మరొక రేటును కూడా మాట్లాడుకునే విధంగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అమెజాన్ లో ఈ సినిమాని పే రెంట్ పద్ధతిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదివరకే కొన్ని సినిమాలకు ఇదే తరహాలో ప్రణాళిక వ్యవహరించిన అమెజాన్ ప్రైమ్ మంచి ప్రాపర్టీని అందుకుంది మరి కాంతారావు సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందేమో చూడాలి. అయితే ఈ సినిమా నవంబర్ సెకండ్ వీక్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: