అంతేకాదు ప్రస్తుతం తన తాతయ్యకు ఉన్న రేంజ్ లో ఆయనకు కూడా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యన వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ,హరికృష్ణ, కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్, తారకరత్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళందరూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఇక వీళ్ళందరిలో తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ సినిమా అయిపోవడంతోనే ఏకంగా తొమ్మిది సినిమాలకు సైన్ కూడా చేశారు ఈ నటుడు
ఒకేసారి అన్ని సినిమాలకు సైన్ చేయడంతో ఈయనని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పొచ్చు. అయితే ఈయన ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీ నుండి అవకాశాలు లేక కనుమరుగై పోయారు. ఈయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత ఈయన నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీని తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా కూడా నటించారు. ఇక ఈ సినిమాలో ఈయన నటనకు గానూ నంది అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమా తర్వాత తారకరత్నకు ఒక్క అవకాశం కూడా రాకుండా ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు మరీ, ఆ తర్వాత ఆయన నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ వారి ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఫ్యామిలీకి దూరంగా ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకోకుండా ఉంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట ఈ నటుడు.
ఇక తారకరత్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేటప్పుడు కనీసం తన పిల్లల అవసరాలు కూడా తీర్చలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడట ఈ నటుడు, అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మినిట్ ఆయన అన్నకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడట. ఎన్టీఆర్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలకు పైగానే అమౌంట్ పంపిస్తున్నారు అంటూ వార్తలు బాగానే వచ్చాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో తారకరత్న ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్..నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు నాకు అండగా నిలబడి నన్ను రక్షించాడు అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు మరీ. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విషయం తెలిసినా ఆయన అభిమానులు నువ్వు చాలా గ్రేట్ అన్నా అంటూ పొగుడుతున్నారు తారకరత్న.