కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ టూర్‌లో భాగంగా ముంబయి చేరుకున్న చిత్ర హీరో రిషబ్ శెట్టి.. సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంతారపై వస్తున్న పలు విమర్శలు, సినిమా హిందీ రీమేక్ వంటి విషయాలపై ఆయన స్పందించారట..
ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం 'కాంతార' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ టూర్‌లో భాగంగా ముంబయి చేరుకున్న చిత్ర హీరో రిషబ్ శెట్టి.. సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంతారపై వస్తున్న పలు విమర్శలు, సినిమా హిందీ రీమేక్ వంటి విషయాలపై ఆయన స్పందించారట..
''సినిమాపై వస్తున్న విమర్శలపై ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదు. అందరికీ సొంత అభిప్రాయాలు అయితే ఉంటాయి. వంద శాతం మా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఎంతలా ప్రజాదరణ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. నెగటివ్ కామెంట్స్‌కు ప్రేక్షకులే సమాధానమిస్తారు'' అని అన్నారట..
అనంతరం కాంతార సినిమాను హిందీలో రీమేక్ చేస్తే ఏ హీరో నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు.. రిషబ్ శెట్టి సమాధానమిస్తూ… ''కాంతార సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన సినిమా. ఈ చిత్రంలో పాత్రలను పోషించాలంటే అక్కడి సంస్కృతిని తెలుసుకోవాలి. హిందీ చిత్రపరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలున్నారు. వారంటే నాకు ఇష్టం. అయితే, రీమేక్‌పై నాకు పెద్దగా ఆసక్తి అయితే లేదు'' అంటూ చొప్పుకొచ్చారు.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారట.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.