ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో కార్తికేయ-2 కూడా ఒకటి. ఈ చిత్రం ఆగస్టు 13వ తేదీన ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పాటు ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా అన్ని భాషలలో విశేష స్పందన లభించింది.నార్త్లో కార్తికేయ-2 సెనో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు వస్తున్నామని సృష్టించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇటీవల ఓటీటి లో కూడా ఈ సినిమా విడుదలై మంచి వ్యూస్ రాబట్టింది. కార్తికేయ-2 సినిమాని అగ్ర దర్శకులు సినీ సెలబ్రిటీలు సైతం రాజకీయ నాయకులు చూసి ప్రశంసలు కురిపించారు.


ముఖ్యంగా ఇస్కాన్ లేక, గుజరాత్ సీఎం ,బిగ్ బి అమితాబచ్చన్, పవన్ కళ్యాణ్ తదితరులు సైతం కార్తికేయ టీం లో మెచ్చుకొని అభినందించారు తాజాగా న్యూ జెర్సీ ఎడిషన్ మేయర్ సామ్ జోషి కార్తికేయ సినిమాని చూసి యునిటైడ్ స్టేట్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు గాను హీరో నిఖిల్ సత్కరించారు. తమ కార్యాలయం తరఫున ప్రశంస ప్రాంతాన్ని కూడా అందించారు. సామ్ జోషి మాట్లాడుతూ అందరికీ నమస్కారం మేము నిఖిల్ చిత్ర పరిశ్రమలు అతని అద్భుతమైన పనిని గుర్తించాలని కోరుతున్నాము ఇటీవలే కార్తికేయ -2 సినిమా అమెరికాలో మరియు భారతదేశంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


అందుకు మేము చాలా గర్వపడుతున్నాము మేయర్ కార్యాలయం ద్వారా అతనికి ఒక ప్రశంసా పతాన్ని కూడా అందజేశాము అని తెలియజేశారు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ ఈ గౌరవానికి చాలా ధన్యవాదాలు సార్ ఇది ఎడిసన్ మేయర్ సామ్ జోషి సార్ నుండి వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను.. నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు. శ్రీకృష్ణుడు , కృష్ణవతత్వం ద్వారకానగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇందులో హీరోయిన్గా అనుపమ నటించగా.. కీలకమైన పాత్రలో శ్రీనివాసరెడ్డి, ఆదిత్య మీనన్, వైవా హర్ష అనుపమఖేర్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: