తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జాతి రత్నాలు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. ఇక ఈ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది.ఈ సినిమా తర్వాత పలు ఆఫర్లను కూడా దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కథ నచ్చితే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. జాతి రత్నాలు సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా హైట్ పరంగా టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు .


తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా శోభన్ నటించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఫరీయా అబ్దుల్లా, శోభన్, డైరెక్టర్ గాంధీ ఆలీతో సరదాగా షోలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సరదాగా కొనసాగిందని తెలుస్తోంది ఒక సందర్భంలో కమెడియన్ ఆలీ మాట్లాడితే జాతి రత్నాలు షూటింగ్ సమయంలో డైరెక్టర్ నిన్ని కొట్టారట కదా అని ఫరీయా ను అడగగా.. దీనిపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ అనుదీప్ జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ సరదాగా పక్కన ఉన్న వారిని కొట్టడం ఒక అలవాటు అని తెలియజేసింది.


అలాగే తనకు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని తెలిపింది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఓటీటి లో కూడా సందడి చేస్తోంది. మరి ఫరియా అబ్దుల్లాకు లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: