యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాకు సంబంధించి సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నారు. వచ్చేయేడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా ఇంకా తర్జనభజన జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కించడం జరుగుతుంది ఈ సినిమా ఒక మెడికల్ మాఫియానే టచ్ చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్పొరేట్ వైద్యం గురించి కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు సమాచారం.


పేదవాళ్లకు వైద్యం ఖరీదును తీరును చూపిస్తూనే అందుకు గల కారణాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం . ఇక గతంలో 30వ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు అందులో రక్తంతో తడిసి ముద్దైన చరిత్ర ఈనెల గుర్తుపెట్టుకుంటుంది. అతని నేల చరిత్ర అని కానీ ఆ అతని రక్తం కాదు.  అంటూ టీజర్ లో రివిల్ చేయడం జరిగింది. కొరటాల శివ తన మార్కును మరొకసారి చూపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ సినిమా పాయింట్ని అనుకోకుండా ట్రైలర్లు ఆ రకంగా కట్ చేసి చూపించారట.అయితే ఇప్పుడు అందులోనే మూల కథని మారుస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ కి ఈ సినిమాకు సంబంధించిన పనులు మరో మూడు నెలలు కూడా కొనసాగబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే గనక నిజమైతే మెడికల్ మాఫియా పై డైరెక్టర్ ఎన్టీఆర్ సమర శంఖం పూరించినట్లే అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే గతంలో ఠాగూర్ గణేష్ వంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి మెడికల్ నేపథ్యంలో వచ్చిన సినిమాకు బలమైన కంటెంట్ తోడైతే చాలు కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: