ఇదంతా ఇలా ఉండగా జాన్వీ కపూర్ తాజాగా మీలి అనే సినిమాలో నటించింది ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన జాన్వి ఎన్టీఆర్ నటన పైన ఎన్టీఆర్ పైన ప్రశంసల వర్షం కురిపించింది. తను ఒక లెజెండ్ అంటూ ఈ ముద్దుగుమ్మ తెలియజేయడంతో ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వస్తే.. నటిస్తారా అనే ప్రశ్న ఎదురవుగా.. కచ్చితంగా నటిస్తానని తెలియజేసింది దీంతో ఎన్టీఆర్ తన 30 వ ప్రాజెక్టుకి ఈమె హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ కు జోడిగా జాన్వి కపూర్ నటిస్తే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఈ విషయం పైన సెటైర్లు వేయడం జరుగుతోంది. ఇక జాన్వి కపూర్ గొప్ప గొప్ప పాత్రలు.. అంతగా నటిగా పేరు తెచ్చిన సినిమాలు ఏవి లేవు నటన కూడా అంతంత మాత్రమే తెలుసు కేవలం గ్లామర్ డాల్ గా ఇమేజ్ తో హాట్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అయితే ఈమె ఎన్టీఆర్ పక్కన నిలబడగలద అనే అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.