గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలిలో పలు విభేదాలు ఉన్నాయని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల మధ్య అసలు సరిగ్గా మాటలు లేవని పుకార్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ కారణంగానే అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి అల్లు అర్జున్ కనీసం ఒక ట్విట్ కూడా చేయలేదని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అల్లు హీరోల మధ్య గొడవకు కారణం ఏంటనే విషయం చాలామంది పలు రకాలుగా ఊహా గానాలను తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఎప్పుడూ కూడా అల్లు కుటుంబం స్పందించలేదు.


అయితే ఈ విషయం ఇండస్ట్రీ అంతా చాలా పాగిపోవడం జరిగింది ఇటీవలే అల్లు శిరీష్ స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత కూడా ఇచ్చారు. ఒక్క ట్విట్ చేస్తేనే తమ మధ్య ప్రేమ ఉన్నట్లా అంటూ అల్లు శిరీష్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..తన సినిమా ఒక్క సక్సెస్ మీట్ కి అన్నయ్య అల్లు అర్జున్ తో రాబోతున్నట్లు తెలియజేశారు. అనుకున్నట్లుగానే అల్లు అర్జున్ సక్సెస్ మీట్ కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా షిరీస్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.


వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అనడానికి ఇదే ప్రత్యేకమైన సాక్షమని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ కూడా తన తమ్ముడు గురించి మాట్లాడిన సందర్భంగా కాస్త ఎమోషనల్ అయిన విషయం అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో తమ కుటుంబానికి వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: