కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తేరకేకుతున్న వరిసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందుతున్న ఈ మూవీ ని తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన ,  దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లిమూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు అని ,  అంతకుమించి భారీ లెవల్లో ఉండబోతుంది అని చెప్పాడు దానితో ఈ మూవీ పై దళపతి విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా వరిసు మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. రజితమై అంటూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.  ఈ సాంగ్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 22 మిలియన్ ల వ్యూస్ ను , 1.4 మిలియన్ లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే వరిసు మూవీ లోని రంజితమే సాంగ్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: