ప్రతి ఏడాది సంక్రాంతికి వరుస పెట్టి సినిమాలు విడుదల అవ్వడం చూస్తున్నాము..అప్పుడు కొన్ని సినిమాలు భారీ వసూళ్లను రాబడితే,మరి కొన్ని డిజాస్టర్ అవుతున్నాయి.. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము..పండగ వస్తే చాలు ఇండస్ట్రీ సీజన్ వచ్చినట్టే అంతకు ముందు సీజన్ అంటే సంక్రాంతి పండగ ఒక్కటే. కానీ ఇప్పుడు పండగ ఏదైనా థియటర్స్ దగ్గర సినిమాల సందడి కనిపిస్తుంది.
పెద్ద చిన్న అని తేడా లేకుండా పండగలను టార్గెట్ చేసుకొని లను దింపుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సంక్రాంతి బడా సినిమాలన్నీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతుంటే అటు శివరాత్రిని కూడా కొన్ని సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరి లో పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ల్లో.. ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని అఖిల్ ఏజెంట్ గురించే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న విషయం తెలిసిందే..తాజాగా గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా తో హిట్ అందుకున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మంచి హిట్ గా నిలిచింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ లో అఖిల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏజెంట్ గా రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ భారీ లు బరిలో ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. అలా అయితే ఈ మూవీ శివరాత్రికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.అలాగే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ ఫిబ్రవరి లో శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధనుష్ ‘సార్’ ను కూడా శివ రాత్రికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ మూవి ను విడుదల అవనుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ బింబిసార తో హిట్ అందుకున్నాడు..