చైల్డ్ యాక్టర్ గా తేజ సజ్జ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కెరియర్ ప్రారంభంలో నుంచి విభిన్నమైన జోనర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ యువ హీరోతో కలిసి మొదటిసారి పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. జాంబిరెడ్డి వంటి కమర్షియల్ సినిమా హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొంది.


ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన ఈ సినిమా టీజర్ ని గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దసరా పండుగకి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఆది పురష్ సినిమా కోసం వాయిదా వేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ పండుగ సందర్భంగా ఎట్టకేలకు హనుమాన్ సినిమాకు సంబంధించి అప్డేట్ ని ప్లాన్ చేసామని కానీ ఆరోజు ఏకంగా రాముడే వస్తుండడంతో మా అప్డేట్ వాయిదా వేసుకున్నామని తెలిపారు. రాముడు ఇచ్చిన తర్వాతే హనుమంతుడు వెనకనే వస్తారని తెలిపారు చిత్ర బృందం.


అయితే ఎట్టకేలకు హనుమాన్ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అయితే రాముడు గాథను తెలియజేసే ఆది పురుష్ సినిమా టీజర్ పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు హనుమంతుడి కథను చెప్పే మూవీ టీజర్ ఎలా ఉంటుందో అంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ఇటీవల కాలంలో వచ్చిన సూపర్ న్యాచురల్ సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్ పై సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్వాలిటీ లేని నేపథ్యంలో నిటిజన్లు కూడా చాలా దారుణంగా ట్రోల్స్  చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమా కూడా గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్నది. ఇక ఆదిపురు సినిమా టీజర్ చుట్టూ కూడా చాలా ట్రోల్లింగ్స్ వినిపించాయి. మరి హనుమాన్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: