అప్పట్లో నాకు పెద్దగా చదువు వచ్చేది కాదు. ఇంట్లో వాళ్లు ఎగ్జామ్ ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. కానీ నేను ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపో తానని నాకు తెలుసు. అందుకే బాగా ఆలోచించి మద్రాస్ రైల్ ఎక్కేశాను.
వాస్తవానికి నేను టికెట్ తీసుకునే రైలు ఎక్కాను. కానీ టీసీ టికెట్ చెక్ చెస్తున్నప్పుడు చూస్తే నా జేబులో లేదు. అది మధ్యలో ఎక్కడో పడిపో యిందని నాకు అర్థమైంది. ఇదే విషయం టీసీ కూడా చెప్పాను.
కానీ ఆయన తొలుత నమ్మలేదు సరికదా.. జరిమానా కట్టాల్సిందేనంటూ అందరి ముందు గట్టిగా అరుస్తూ హెచ్చ రించాడు. నా పరిస్థితి చూసిన అక్కడ ఉన్న రైల్వే కూలీలు ఐదుగురు నాకు సాయం చేసేందుకు ముందు కు వచ్చారు. వారికి నేను నిజాయతీ గా జరిగింది చెప్పాను.
నేను వాళ్లతో చెప్తున్న తీరు చూసిన టీసీ.. నిజమే చెప్తున్నానని అప్పుడు నమ్మాడు. నాకు తెలిసి నన్ను ఓ వ్యక్తి నమ్మడం అదే తొలిసారి'' అని రజనీ కాంత్ గుర్తు చేసు కున్నారు. మద్రాస్ వెళ్లాక అక్కడ దర్శకుడు కె. బాల చందర్ ఆ తర్వాత తనని నమ్మారని గుర్తు చేసుకున్న రజనీకాంత్ ఇప్పుడు అభిమానులు తనని నమ్ముతు న్నారని ఎమోషనల్ అయ్యారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనని కూడా రజనీకాంత్ ప్రామిస్ చేశారు.