ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేక్షకులు సైతం ఓటీటీలోనే సినిమాలు చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందుచేతనే థియేటర్లో విడుదలైన కేవలం 30 రోజులలోనే సినిమాలు ఓటీటి లో అలరిస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలు ఓటీటి సంస్థలు కూడా భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నాయి. ఇలా ఓటిటి లో చూడడానికి ఇంటర్నెట్ అనేది చాలా అవసరం. ఇక రాబోయే సినిమాలు ,వెబ్ సిరీస్స్, టాక్ షోలు ఇంటర్నెట్ లేకుండానే చూసే విధంగా ఒక సదుపాయాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మల్టీమీడియా కంటెంట్ తో నేరుగా మొబైల్స్ లోనే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ టూ మొబైల్ (D2M) అనే టెక్నాలజీ తో రాబోతోందట. అయితే కొన్ని విపత్తులతో పాటు, పౌరులకు నేరుగా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి, అత్యవసర హెచ్చరికలు జారీ చేయడానికి నకిలీ వార్తలను తిరస్కరించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుందని దీని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ తెలియజేస్తోంది. దీంతో ఆ స్ట్రెక్టమ్ బ్రాండ్ ను కనుగొన్నట్లుగా తెలియజేశారు.


టెక్నాలజీ వినియోగదారుల స్మార్ట్ మొబైల్ కు ప్రసార సేవలను అందించడంలో కూడా సహాయపడుతుందని పలువురు అధికారులు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్లో ఈ D2M సాంకేతికను పరీక్షించడానికి ఐఐటి కాన్పూర్ పబ్లిక్ బ్రాడ్ క్రాస్టర్ ప్రసార భారతి తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. ఈ సదుపాయం మనకి అందుబాటులోకి రావడానికి మూడు సంవత్సరాలు పడుతుంది ఈ సరికొత్త టెక్నాలజీ ఎఫ్ఎం రేడియో లాగా పనిచేస్తుందట. రేడియో ఫ్రీక్వెన్సీ లను యాక్సెస్ చేయడానికి రిసీవర్ల ఉపయోగపడుతుంది. ఓటిపి ప్లాట్ఫారం మొబైల్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ను అందించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చట. దీనివల్ల మరి రాబోయే రోజుల్లో ఓటీటి లో  సినిమాలను ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా చూసుకోవచ్చని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: