సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా పరిచయమైన దిల్ రాజు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇక  దిల్ సినిమాకు ముందు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు.అయితే అప్పటి వరకు రాజును అందరూ నైజాం రాజు అని పిలిచేవారు. దిల్ సక్సెస్ తరవాత మరి కొన్ని సూపర్ హిట్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. అంతే కాకుండా ఇక  తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నిర్మాతగా ఆ రేంజ్ లో ఎదిగిన క్రెడిట్ కూడా దిల్ రాజుకే దక్కుతుంది.  దిల్ రాజు శ్రీవెంకటేశ్వర బ్యానర్ ద్వారా చిన్న హీరోలకు లైఫ్ ఇస్తూనే పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ - తమిళ స్టార్ విజయ్‌లతో రెండు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు.ఇక  ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ భారీ బడ్జెట్ చిత్రాలపైనే ఉంది. దిల్ రాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రీసెంట్ గా ఓ కొడుకుకు జన్మనిచ్చారు. అయితే ఇక  దిల్ రాజుకు మొదట అనితతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.కాగా వీరిద్దరి కూతురు అన్సితకు ఇప్పటికే పెళ్లి కావడంతో పాటూ ఓ బాబు ఉన్నాడు.అయితే మొదటి భార్య అనిత అనారోగ్యంతో మృతి చెందిన తరవాత దిల్ రాజు రెండో భార్యగా తేజశ్వినిని వివాహం చేసుకున్నాడు.

ఇక వీరి వివాహం ఎలాంటి ఆడంబరం లేకుండా జరగ్గా పెళ్లి తరవాత స్టార్స్ కు దిల్ రాజు ఘనంగా పార్టీ ఇచ్చారు. రీసెంట్ గా రెండో భార్యతో కొడుకుకు జన్మనివ్వడంతో దిల్ రాజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో రూమర్లు రావడం కామన్.  దిల్ రాజు విషయంలోనూ కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి.ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య మరణించిన తరవాత కొంతకాలానికి రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఇక  దిల్ రాజు వివాహం హీరోయిన్ అనుష్కతో జరగబోతుందని ప్రచారం జరిగింది.ఆ వార్తలను హీరోయిన్ అనుష్క తీవ్రంగా ఖండిచింది. అయితే ఆ తరవాత కొంతకాలానికి దిల్ రాజు తేజశ్వినిని వివాహం చేసుకున్నాడు.ఇక ఆ తరవాత రూమర్లకు చెక్ పడింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: