ఇక పవన్ కళ్యాణ్ కోసం దేవారా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు బండ్ల గణేష్. అయితే ఈ టైటిల్ తోనే సినిమాను ఫిక్స్ చేయాలని బండ్ల గణేష్ అనుకున్నారు. అయితే బండ్ల గణేష్ ఎన్నో ఏళ్లుగా ఈ టైటిల్ ను దాచుకున్నప్పటికీ తాజాగా ఎన్టీఆర్ ఈ టైటిల్ని తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవర అనే టైటిల్ ని చాంబర్లో రెన్యువల్ చేయడం బండ్ల గణేష్ మర్చిపోయారట. దీంతో ఎన్టీఆర్ తన 30 వ సినిమాకు దేవర అనే టైటిల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ విషయం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా సమాచారం లేదు. కానీ ఈ విషయం మాత్రం బండ్ల గణేష్ కు ఒక షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లిక్ లో ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై బండ్ల గణేష్ కూడా ఎలా స్పందిస్తారో చూడాలి.