కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవంతో నిర్మాతలు డైరెక్టర్లు మాత్రం పవన్ ని ఇబ్బంది పెట్టలేదని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఒప్పుకున్నప్పుడే తన పరిస్థితుల గురించి క్లారిటీ ఇచ్చి రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నిర్మాతలు పవన్ కళ్యాణ్ సమయాన్ని బట్టి షూటింగ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అలాగే వచ్చే ఎన్నికలను నేపథ్యంలో బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క చిత్రాన్ని మాత్రమే షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆచిత్రమే హరిహర వీరమల్లు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాను తర్వాత ఏ సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా తో పాటు మరొక రీమిక్స్ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ నిలిపివేసినట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల వరకు అసలు ఏ సినిమాను కూడ పవన్ కళ్యాణ్ చేయరు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేవలం తన ఫోకస్ అంతా ఎన్నికల మీద పెట్టినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి మరి.