ఇక రాజీవ్ కనకాల విషయానికి వస్తే.. ప్రఖ్యాత నటుడు, రంగస్థలం నటుడు, దర్శకుడు , నిర్మాత అయిన దేవదాస్ కనకాల కుమారుడే.. వీళ్ళ అమ్మ కూడా లక్ష్మీ కనకాల కూడా రంగస్థలం నటి. ఈయన మొదటిసారి రంగస్థలం నటుడిగా ఉంటూనే వెల్కమ్ బ్యాక్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాంబంటు సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇకపోతే నవంబర్ 13 1968లో హైదరాబాదులో జన్మించిన ఈయన నిన్న 53వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల తన భార్య సుమాతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్న వేడుకలను వీడియో ద్వారా ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అంతేకాదు టైటానిక్ తరహాలో వీళ్ళిద్దరూ ఒక పడవలో ఫోజులు ఇవ్వడం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది అని చెప్పాలి. ఏది ఏమైనా రాజీవ్ కనకాల వయసు 53 సంవత్సరాల అనేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా యంగ్ గా కనిపించే ఈయన వయసు ఇంతనా అంటూ తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.