
డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా అన్ని విభాగాలను సమన్వయము చేసుకుంటూ సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఈ సినిమాలో పాటలకు మంచి స్వరాలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మరియు నేపధ్య సంగీతాన్ని అందించిన ఎస్ ఎస్ థమన్ ల వలన కూడా సినిమా హిట్ అయింది అని చెప్పుకోవాలి. కాగా ఈ సినిమా హిట్ కావడంతో సీక్వెల్ ను కూడా తీయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. కానీ సీక్వెల్ లో మాత్రం టీం టీం మారిపోయింది. ఇందులో రాధిక అనే పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా నటించింది.. కానీ ఇప్పుడు ఆమె సీక్వెల్ నుండి తప్పుకుంది.. తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ టిల్లు 2 లో నటిస్తోంది.
ఇక సంగీత బాధ్యతలను భుజాన వేసుకున్న ఎస్ ఎస్ థమన్ మరియు శ్రీచరణ్ పాకాల స్థానంలో... టైటిల్ సాంగ్ తో అదరగొట్టిన రామ్ మిరియాలను మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకు తీసుకున్నారు. ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ గా చెప్పుకునే డైరెక్టర్ ను కూడా మార్చడం విశేషం.. మొదటి పార్ట్ కు పనిచేసిన డైరెక్టర్ విమల కృష్ణను కాదని మల్లిక్ రామ్ ను డైరెక్టర్ గా తీసుకున్నారు. అయితే ఇలా ఇన్ని రిస్క్ లను తీసుకుంటున్న సిద్దు జొన్నలగడ్డ సినిమా ఫలితం ఏమవుతుందో తెలియాలంటే మార్చి 2023 వరకు ఆగాల్సిందే.