తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంది.. వరుస హిట్ సినిమాలను తమ ఖాతా లో వేసుకుంటూ క్రేజ్ ను పెంచుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే వున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ముగ్గురు బ్రేక్‌లోనే ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో సపరేట్ రీజన్‌ ఉన్నా… ముగ్గురు హీరోయిన్లు ఒకేసారి బ్రేక్ తీసుకోవటంపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.ఇంతకీ ఆ ముద్దుమ్మలు ఎవరంటే.. రీసెంట్‌గా తన హెల్త్ ఇష్యూ గురించి రివీల్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ట్రీట్మెంట్‌లో ఉన్నారు. చికిత్స తీసుకుంటూనే యశోద పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ ఫినిష్ చేసి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రజెంట్‌ లాంగ్ బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారు సామ్‌. పూర్తిగా కోలుకున్న తరువాతే నెక్ట్స్ ను పట్టాలెక్కించాలన్నది ఈ టాప్ బ్యూటీ స్కెచ్‌. మరో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా ప్రజెంట్ రెస్ట్‌లోనే ఉన్నారు. కాలు ఫ్యాక్చర్ కావటం తో చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన బుట్టబొమ్మ.. ఈ మధ్యే ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. అయితే పూర్తి స్థాయిలో షూటింగ్‌ చేసేందుకు వీలు కాకపోవటంతో మూవీ షెడ్యూల్స్‌ను వాయిదా వేసుకుంటున్నారు జిగేల్‌ రాణి.

రీసెంట్‌గా బాలీవుడ్ మూవీ గుడ్‌బై తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన రష్మిక మందన్న కూడా ప్రజెంట్‌ బ్రేక్‌లోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన మీద వస్తున్న నెగెటివిటీ తో విసిగిపోయిన కూర్గ్ బ్యూటీ ఈ డిస్ట్రబెన్స్‌ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. పుష్ప 2 షెడ్యూల్‌ కు ఇంకా టైమ్ ఉండటంతో ఈ గ్యాప్‌ను పర్సనల్‌ యాక్టివిటీస్‌ కోసం కేటాయించారు రష్మిక. ఇలా ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోయిన్లు బ్రేక్ తీసుకోవటంతో ఈ ఎఫెక్ట్ అప్‌కమింగ్ ల రిలీజ్ డేట్స్ మీద పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు..మరి ఏం జరుగుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: