టాలీవుడ్లో కొంతమంది స్టార్ డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు చాలా విచిత్రంగా మారిపోతోంది. కొంతమంది స్టార్ హీరోల చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ ఉంటే.. మరి కొంతమంది హీరోలు ఖాళీ లేకపోవడంతో తన తదుపరి చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూడవలసి వస్తోంది. కొంతమంది ప్రాజెక్టులకు ఓకే అయినా కొన్ని అనుకోని కారణాల చేత అడ్డంకుల వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అలాంటి వారిలో డైరెక్టర్ క్రిష్ తర్వాత త్రివిక్రమ్ ఉన్నారని చెప్పవచ్చు. 2020లో అలా వైకుంఠపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పరవాలేదు అనిపించింది.


ఇక అటు తరువాత పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాకు వర్క్ చేసి.. దాదాపుగా మూడు సంవత్సరాలు తమ సమయాన్ని వృధా చేశారు. ఇక అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుని చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఎన్టీఆర్ డేట్లు దొరక్క చేయలేకపోయారని సమాచారం.. మధ్యలో ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోవడం జరిగింది. తర్వాత మహేష్ బాబు తో కలిసి మహేష్ 28వ సినిమా అని మొదలుపెట్టారు.

ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా మొదలయ్యే వరకు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా మొదటి భాగం పూర్తి అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే మహేష్ సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి మరణించడంతో మద్య మద్యలో బ్రేకులు పడడం జరిగింది. ఇక అటు తరువాత పూజా హెగ్డే కాలికి కూడా గాయం తగలడంతో డిసెంబర్లో తదుపరి షెడ్యూల్ ని పోస్ట్ ఫోన్ చేశారు. ఇక అంత లోనే స్క్రిప్టులో మార్పులు మొదలు కావడం ముందు చేసిన యాక్షన్ షెడ్యూల్స్ ని పక్కన పెట్టడం వంటి మార్పులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతా ఓకే అనుకున్న సమయంలో కృష్ణ మరణ వార్తతో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి  ఇలా అయ్యింది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: