ముంబై కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను తమన్నా వివాహం చేసుకోబోతోందని సమాచారం. ఈ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్లుగా సమాచారం. తమన్నా తల్లిదండ్రులకు పెళ్ళికొడుకు బాగా నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై తమన్నా మాత్రం ఏ విధంగా స్పందించకపోవడం జరుగుతోంది. స్టార్ హీరోలకు జోడిగా నటించిన తమన్నా సినిమాల మెజారిటీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటోంది.
తమన్నా కెరీర్ ఈ మధ్యకాలంలో వరుస ప్లాప్ అవుతున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అందుకుంటుంది దీంతో స్టార్డం ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నా ఒక్కో చిత్రానికి రూ.3 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. తమన్నా వివాహమైన కూడా సినిమాలలో నటించాలని అభిమానులు మాత్రం కోరుకుంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి తమన్నా పెళ్లి వార్త స్పందించి ఒక క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి మరి.