కోలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందింది హీరోయిన్ నయనతార. ఇక టాలీవుడ్ లో కూడా అంతే పేరును సంపాదించింది ఈ అమ్మడు. గత కొంతకాలంగా విభిన్నమైన సినిమాలతో తమిళంలో కేరాఫ్ అడ్రస్ ని నిలిచింది. ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాల నటిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. తాజాగా నయనతార మరొక థ్రిల్లర్ సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. అశ్విన్ శరవరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నయనతార తో డైరెక్టర్ అశ్విన్ కు ఇది రెండవ చిత్రము. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మాయ అనే ఒక హర్రర్ చిత్రం రావడం జరిగింది.

ఇప్పుడు మరొకసారి అలాంటి హారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక కార్తికేయ-2 చిత్రంతో సౌత్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ కేర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర నటిస్తూ ఉన్నారు. ఇక అలాగే సత్యరాజు కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా చిత్ర బృందం ఇటీవల విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే యేసు శిలను దండం పెడుతున్న నయనతారతో పాటు చేతిలో రుద్రాక్ష దండం పట్టుకుని దేవుడు చిత్రపటాలకు నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.


ఈ చిత్రానికి కనెక్ట్ అనే టైటిల్ని నియమించినట్లుగా తెలుస్తోంది అలాగే నయనతార తలకిందులుగా రెండు పాత్రల కనిపించబోతోంది. ఈ చిత్రంలో కూడా నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నవంబర్ 18న ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నటుడు వాన హీరో ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ శరవరన్ భార్య కావ్యా రామ్ కుమార్ అశ్వినితో కలిసి కథని అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: