యంగ్ హీరో అఖిల్ కష్టాలను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ కొంతవరకు తగ్గించినా ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ అతడి కెరియర్ ను మరింత గందరగోళంలో పడేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీని నిర్మిస్తున్న అనీల్ సుంకర మొదట్లో ఈమూవీని 40 కోట్ల బడ్జెట్ తో తీయాలని అనుకుంటున్నాడు అని మొదట్లో వార్తలు వచ్చినట్లు అఖిల్ పై ఏధైర్యంతో అనీల్ సుంకర అంత పెట్టుబడి పెడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడినట్లు తెలుస్తోంది.



ఈసినిమా ప్రారంభం సమయంలో ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న సురేంద్ర రెడ్డి ఈమూవీకి సహ నిర్మాతగా వ్యవహరిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సురేంద్ర రెడ్డి ఈ మూవీకి సహ నిర్మాత కాదని కేవలం దర్శకత్వానికి మాత్రమే పరిమితం అయ్యాడు అంటూ మరో గాసిప్పులు వస్తున్నాయి.


దీనితో ‘ఏజెంట్’ మూవీ పై ఆమూవీకి దర్శకత్వం వహిస్తున్న సురేంద్ర రెడ్డికి నమ్మకం లేదా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బడ్జెట్ మరింత పెరిగిపోయి 80 కోట్ల స్థాయికి చేరుకుందని మరికొందరు అంటున్నారు. ఆ వార్తలే నిజం అయితే అఖిల్ లాంటి హీరో మీద అనీల్ సుంకర ఏధైర్యంతో 80 కోట్లు పెడుతున్నాడు అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు.  ఈ మూవీ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. విపరేతమైన యాక్షన్ సీన్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని దేశంలోని అనేక కీలక ప్రాంతాలలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.



ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఫైనల్ అవుట్ పుట్ ను చూసిన నాగార్జున సలహాతో ఈమూవీలో మళ్ళీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. చిట్టచివరకు ఏదోవిధంగా ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల మధ్య భీకర సమరంగా మారిన పరిస్థితులలో అఖిల్ ‘ఏజెంట్’ కు స్థానం ఎక్కడ ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా తనపట్టు విడవకుండా సంక్రాంతి వస్తూ ఉండటంతో ‘ఏజెంట్’ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏమిటి అంటూ షాక్ అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: