తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. రికార్డు స్థాయిలో సినిమాలలో నటించిన రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యువ హీరోయిన్లకు దీటుగా నటిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐదు పదుల వయసు దాటినా కూడా ఏమాత్రం తగ్గకుండా రమ్యకృష్ణ స్పీడ్ గా వరుస సినిమాలు చేస్తూ ఉంటోంది. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ ఈమెకు అవకాశాలు దక్కించుకుంటూనే ఉంటోంది. అప్పటివరకు సెకండ్ ఇన్నింగ్స్ లో చిన్న చిన్న పాత్రలో నటించిన రమ్యకృష్ణ బాహుబలి సినిమా నుంచి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడమే కాకుండా పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ వస్తోంది.ఇక హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో సక్సెస్ అందుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన హవా కొనసాగిస్తూ బిజీగా ఉంది. రమ్యకృష్ణ కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తరచుగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రమ్యకృష్ణ కు సంబంధించి కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రాములు షేర్ చేయగా రమ్యకృష్ణ అందం ఇంకా పెరుగుతూనే ఉందంటూ పలువురు అభిమానులు , సినీ ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.


ఐదు పదుల వయసు దాటినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని చూపిస్తోంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో కూడా రమ్యకృష్ణ ఈ ఫోటోషూట్ అందరిని ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది రమ్యకృష్ణ. కానీ అంతగా ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తన భర్త తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: