గాలోడు సినిమా విషయానికి వస్తే..సుధీర్( రాజు) అనే పాత్రలో ఒక పల్లెటూరి కుర్రాడులా కనిపిస్తూ ఉంటాడు అదే ఊరిలో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు.. ఒకరోజు పేకాటలో ఆ ఊరి సర్పంచి కొడుకు పైన చేయి చేసుకోవడంతో ఆ వ్యక్తి మరణిస్తాడు. దాంతో సుదీర్ భయంతో ఆ ఊరు వదిలి హైదరాబాదుకు వెళ్ళిపోతారు. అక్కడ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న శుక్ల (గెహ్న సిప్పి) పరిచయమవుతుంది. అలా ఆకతాయిల నుంచి శుక్లా ను ఒకసారి కాపాడగా శుక్లా తన తండ్రితో చెప్పి తన ఇంట్లోనే డ్రైవర్గా ఒక ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. ఇక అలా సాగుతున్న సమయంలోనే రాజు సొంత ఊరిలో సర్పంచ్ కొడుకుని చంపిన వ్యక్తులు వెతుకుతూ హైదరాబాద్ కి వస్తారు ఆ తరువాత.. రాజును పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడం జరుగుతుంది. అయితే సుధీర్ ఎలా నిర్దోషిగా బయటికి వచ్చి తమ ప్రేమను గెలిపించుకుంటారు అనే కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది.
ఇక సుధీర్ ని ఇందులో చాలా బిల్డప్ గా చూపించారని ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా హీరోయిన్ చూడడానికి అందంగా ఉన్న పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది అంటు కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కెమెరా పనితరం తప్ప మిగతావన్నీ మైనస్ గా ఉన్నట్లుగా తెలియచేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో సుడిగాలి సుదీర్ మరొక డిజాస్టర్ ని మూట కట్టుకున్నాడు. దీంతో ఇక సుధీర్ సినిమా కెరియర్ అయిపోయినట్లే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి సుధీర్ కూడా కేవలం బుల్లితెర పైన మాత్రమే కనిపిస్తారేమో చూడాలి.