టాలీవుడ్
సినిమా పరిశ్రమలో హిట్ అందుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే విజయాన్ని అందుకున్న హీరోలకే నటులకే ఇక్క డ మరిన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా సీతారామమ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని అందాల కలల రాణిగా గుర్తింపు సంపాదించుకుంది
హీరో యిన్ మృణాల్ ఠాకూర్. ఈమె తెలుగులో నటించింది మొదటి సినిమానే అయినా కూడా తెలుగింటి అమ్మాయిల తెరపై కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది.
ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క షాట్ లో కూడా తెలుగుదనం ఉట్టిపడేలా చేసి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీం తో ఈమెకు మంచి మంచి అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే పలువురు దర్శకులు ప్రేమకథ సినిమాలను చేయడానికి ఆమెను అప్రో చ్ అయ్యారు. అయితే తొందరగానే పలు సినిమాలలో ఈమె నటించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ సీతారామమ్
సినిమా విడుదలై చాలా రోజులే అవుతున్నా కూడా ఇంకా ఈమె తన తదుపరి సినిమాను చేసే విషయంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.
మరి ఇప్పటికైనా ఆమె త్వరగా ఏదో ఒక సినిమాను ఎంచుకొని దాని ద్వారా ప్రేక్షకులను తిరిగి అలరిస్తే మంచిది.
తమిళ మలయాళ చిత్ర భాషలలో కూడా సీతారామమ్ విడుదల అవడంతో ఈమెకు అక్కడ మంచి గుర్తింపు ఏర్పడింది. మరి త్వరగా మరో
సినిమా చేసి ఈమె ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి. మరాఠీ
సినిమా ల ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కథానాయికగా రాణించే సత్తా బాగానే కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ
సినిమా లో గ్లామర్ పాత్ర ను పోషించి ఆకర్షించాలి.. అప్పుడు ఆమెకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయాన్ని చెప్పాలి.